Narendra Modi : గిర్ అడవుల్లో ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని గిర్ అడవుల్లో పర్యటించారు.

Update: 2025-03-03 07:13 GMT

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని గిర్ అడవుల్లో పర్యటించారు. ఫొటోలను ఎక్స్ వేదికగా వెల్లడించారు. గిర్ వణ్యప్రాణ సంరక్షణ కేంద్రానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ లయన్ సఫారీ చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆసియాటిక్ సింహాల అభివృద్ధి కోసం ప్రయత్నించానని, వాటి సంఖ్య ఇప్పుడు పెరిగిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం...
ప్రాజెక్ట్ లయన్ కోసం కేంద్ర ప్రభుత్వం 2,900 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందన్న నరేంద్ర మోదీ, గిర్ అడవుల్లో ఆసియాటిక్ సింహాల సంఖ్య పెరగడం శుభపరిణామమని తెలిపారు. భూమి పై ఉన్న అపురూపమైన జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి అందరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన ధర్మం అందరిపైనా ఉందన్న మోదీ భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందిండమే లక్ష్యంగా పనిచేయాలని మోదీ ఆకాంక్షించారు.


Tags:    

Similar News