Narendra Modi : ఇది అసాధారణమయిన విజయం

ఢిల్లీలో విజయం సాధారణమయింది కాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు

Update: 2025-02-08 13:47 GMT

ఢిల్లీలో విజయం సాధారణమయింది కాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ ఎన్నికల విజయోత్సవాల్లో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. షార్ట్ కట్ రాజకీయాలకు ఢిల్లీ ప్రజలు షార్ట్ సర్క్చూట్ ఇచ్చారన్నారు. ఢిల్లీ ప్రజలు సంచలన తీర్పును ఇచ్చారని అన్నారు. నిజమైన అభివృద్ధిని బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే చూడవచ్చని తెలిపారు. తననపై విశ్వాసం ఉంచిన ఢిల్లీ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఢిల్లీలో వేగంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

హామీలన్నీ అమలుచేస్తాం...
ఇచ్చిన హామీలను అన్ని అమలుచేస్తామని తెలిపారు. ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని చెప్పారు. అబద్ధాలతో రాజకీయాలు ఎన్నో రోజులు నడవవని మోదీ అన్నారు. ఈ ఎన్నికల్లో నిజమైన విజేతలు ప్రజలేనేని ఆయన అన్నారు. ఢిల్లీలో విజయంతో కొత్త చరిత్రను సృష్టించామన్నారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారన్న మోదీ తాను పూర్వాంచల్ ఎంపీగా ఉన్నందుకు గర్వ పడుతున్నానని తెిపారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ మూడో సారి అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డును నిరూపించుకున్నారని తెలిపారు. ఢిల్లీని అత్యుతన్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.


Tags:    

Similar News