Narendra Modi : కొత్త జీఎస్టీతో పేదలకు డబుల్ బొనాంజా

రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు దేశ వ్యాప్తంగా అమలులోకి రానున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

Update: 2025-09-21 11:53 GMT

రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు దేశ వ్యాప్తంగా అమలులోకి రానున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. అన్ని రంగాల్లో సంస్కరణలు కొనసాగుతున్నాయని చెప్పారు. 2017లో జీఎస్టీతో కొత్త అధ్యాయం మొలయిందని తెలిపారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం వెళ్లాలన్నా పన్నులు చెల్లించాల్సి వచ్చేదన్నారు. ఆత్మనిర్భర్ భారత్ గా అడుగులు వేస్తున్నామని తెలిపారు. నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గుతాయని మోదీ చెప్పారు. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. గతంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చివస్తువులు అమ్ముకోవాలంటే ట్యాక్స్, టోల్ తో భారం పడేదన్నారు. 2024లో గెలిచిన తర్వాత జీఎస్టీ సంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చామని నరేంద్ర మోదీ తెలిపారు.

పేద, మధ్యతరగతి ప్రజలకు...
వన్ నేషన్ - వన్ ట్యాక్స్ విధానంతో దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు తెచ్చామని మోదీ చెప్పారు. మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు రానుందని మోదీ అభిప్రాయపడ్డారు. జీఎస్టీ సంస్కరణల కారణంగా భారత్ అభివృద్ధి రేటు మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ట్యాక్స్, టోల్ తో కంపెనీలు అనేక ఇబ్బందులు పడ్డాయని అన్నారు. భారమంతా వినియోగదారులపై పడేదని చెప్పారు. చిన్నతరహా పరిశ్రమలకు ఈ సంస్కరణలు మరింత అభివృద్ధి సాధించేందుకు దోహదపడతాయని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త జీఎస్టీతో పేదలకు డబుల్ బొనాంజా అని మోదీ అన్నారు. పండగల సమయంలో అందరికీ మేలు జరుగుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. అన్ని రంగాల్లో సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయని మోదీ తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు దేశాన్ని మరింత బలంగా మారుస్తాయని మోదీ చెప్పారు. ఇంటి నిర్మాణ ఖర్చులతో పాటు అనేక రంగాల్లో వస్తువుల ధరలు తగ్గుతాయని తెలిపారు.






Tags:    

Similar News