Narendra Modi : మహా కుంభమేళాపై స్పందించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్ రాజ్ లో ముగిసిన మహా కుంభమేళాపై స్పందించారు
ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్ రాజ్ లో ముగిసిన మహా కుంభమేళాపై స్పందించారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదన్న మోదీఏర్పాట్ల విషయంలో భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురయితే క్షమించాలని కోరారు. ప్రపంచ మంతా ఐక్యతా కుంభమేళాను చూసి ఆశ్చర్యపోయిందని మోదీ తన బ్లాగ్ లో చెప్పుకొచ్చారు.
కోట్లాది మంది...
ఇంతటి మహాయజ్ఞం నిర్వహించడం అసాధారణమైన విషయమని అన్న మోదీ, దేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి వచ్చినా వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుందని తెలిపారు. ఎవరికీ ఆహ్వానాలు పంపకపోయినా స్వచ్ఛందంగా వారికి వారే తరలి వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారన్న మోదీ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ వచ్చిపుణ్యస్నానాలు చేయడం భారతదేశ ఐక్యతకు నిదర్శనమని తెలిపారు.