మోదీ భద్రతపై నేడు సుప్రీంలో విచారణ

పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని మోదీ భద్రత వైఫల్యంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.

Update: 2022-01-07 02:37 GMT

పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని మోదీ భద్రత వైఫల్యంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ విచారణ చేపట్టనున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ పంజాబ్ వెళ్లడంతో అక్కడ కొందరు ఆయనను అడ్డుకున్నారు. ఫ్లై ఓవర్ పై నే ప్రధాని మోదీ దాదాపు ఇరవై నిమిషాలు వేచి ఉండి, తిరిగి వెనుదిరిగాల్సి వచ్చింది.

భద్రత వైఫల్యంపై.....
ప్రధాని పర్యటన భద్రతాలోపంపై అంతర్జాతీయంగా కూడా విమర్శలు వచ్చాయి. దీనిపై సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. భద్రతావైఫల్యానికి కారణం ఎవరో తేల్చి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటీషన్ లో కోరారు. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.


Tags:    

Similar News