తల్లి మరణించిన బాధలోనూ...?

తల్లి మరణించిందన్న బాధలోనూ దేశమే ముఖ్యమన్న ధోరణిలో ప్రధాని మోదీ వ్యవహరించడం ప్రశంసనీయమైంది.

Update: 2022-12-30 08:29 GMT

తల్లి మరణించింది. ఆమె అంత్యక్రియలు ముగిశాయి. అయినా గంటలోపే ప్రధాని నరేంద్ర మోదీ తన బాధను దిగమింగుకుని కర్తవ్యాన్ని నిర్వహించారు. తల్లి మరణించిందన్న బాధలోనూ దేశమే ముఖ్యమన్న ధోరణిలో ప్రధాని మోదీ వ్యవహరించడం ప్రశంసనీయమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేయడమే కాకుండా ఆకట్టుకుంది.

వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను...
ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ ోని హౌరా న్యూ జల్ పైగురిలను కలుపుతూ ఏర్పాటు చేసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పాల్గొన్నారు. బెంగాల్ లో మొదటి వందే భారత్ రైలు ఇది. ఈ రైలు 7.45 గంటలలోనే 564 కిలోమీటర్ల దూరం వెళుతుంది. ఈ రైలుతో రెండు మార్గాల మధ్య మూడు గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది.


Tags:    

Similar News