83 సంవత్సరాల వయసులో పోర్న్ స్టార్ గా మారిన పాస్టర్
నార్త్ కరోలినాకు చెందిన ఈ పాస్టర్ ప్రపంచ మానవ అక్రమ రవాణా నుండి బయటపడటానికి తన మద్దతును ప్రకటించాడు. అడల్ట్ ఇండస్ట్రీలో..
83 సంవత్సరాల వయసులో పాస్టర్ కాస్తా పోర్న్ స్టార్ లా మారిపోయాడు. పోర్న్ ఫిల్మ్ స్టార్ కావడానికి 83 ఏళ్ల పాస్టర్ తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఆ పాస్టర్ పేరు 'నార్మ్ సెల్ఫ్'. తాను పాస్టర్ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పోర్న్ ఇండస్ట్రీలో పని చేయడం మొదలు పెట్టానని వెల్లడించాడు. నార్మ్ సెల్ఫ్ ఇటీవల మొదటి అడల్ట్ ఫిల్మ్‌లో కనిపించడం ఎంతో "ఆనందకరమైనది" అని తెలిపాడు. నార్మ్ సెల్ఫ్ ఇంతకు ముందు పాస్టర్‌గా పనిచేశాడు కానీ దశాబ్దాల క్రితం ఆ బాధ్యతల నుండి నిష్క్రమించాడు. అతను అడల్ట్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత అతను స్వలింగ సంపర్కుడని గ్రహించాడు. అతను 2017 లో మొదటి సారి అడల్ట్ ఫిల్మ్ చేసాడు.
నార్త్ కరోలినాకు చెందిన ఈ పాస్టర్ ప్రపంచ మానవ అక్రమ రవాణా నుండి బయటపడటానికి తన మద్దతును ప్రకటించాడు. అడల్ట్ ఇండస్ట్రీలో పని చేయడానికి తనకు ఏ మాత్రం బాధగానూ, సిగ్గుగానూ లేదని తెలిపాడు. అతను సెక్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం సంతోషంగా ఉందని.. పోర్న్ భాగస్వాముల మధ్య ఆనందాన్ని పెంపొందించడానికి అనుమతిస్తుందన్నాడు. సెక్స్ అనేది వృద్ధులకు సంబంధించినది కాదనే విషయాన్ని తాను వ్యతిరేకిస్తూ ఉన్నట్లు తెలిపాడు. సాన్నిహిత్యాన్ని ఆస్వాదించే చాలా మంది వృద్ధుల గురించి తనకు తెలుసని చెప్పుకొచ్చాడు.