Austraila : అహ్మద్ కోసం వెల్లువెత్తుతున్న విరాళాలు... ఇప్పటి వరకూ వచ్చిందెంతంటే?

ఆస్ట్రేలియా బోండీ బీచ్ కాల్పుల లో గాయపడిన అహ్మద్ కోసం భారీగా విరాళాలు సమకూరుతున్నాయి

Update: 2025-12-16 05:38 GMT

ఆస్ట్రేలియా బోండీ బీచ్ కాల్పుల లో గాయపడిన అహ్మద్ కోసం భారీగా విరాళాలు సమకూరుతున్నాయి. యూదులపై కాల్పులు జరిపిన ఒక ఉగ్రవాదిని ఉత్తు చేత లతో నిలువరించిన అహ్మద్‌ను ఆస్మలియన్లు హీరోగా కొనియాడుతున్నారు. అతడు ఉగ్రవాదిని అడ్డుకుంటున్న వీడియోను ఆ దేశ మీడియా ప్రధానంగా ప్రసారం చేస్తుండటంతో అహ్మద్ పట్ల ఆస్ట్రేలియన్లు స్పందిస్తున్నారు. కాల్పులు జరుగు తున్న సమయంలో అహ్మద్ సమీపంలోనే ఓ షాపులో తన బంధువుతో కలిసి ఉన్నాడు. ఉగ్రవాదిని చూడగానే.. తాను అతడిని అడ్డుకోవటానికి వెళ్తున్నానని, తనకు ఏమైనా అయినా, చనిపో యినా.. తన కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలని అని అతడికి చెప్పి ఉగ్రవాది వైపు పరుగెత్తాడని అహ్మద్‌కు వరుసకు సోదరు డయ్యే ముస్తఫా అనే వ్యక్తి ఆస్ట్రేలియా మీడియాకు వివరిం చాడు.

గాయపడి చికిత్స పొందుతున్న...
ఉగ్రవాదిని అడ్డుకొనే క్రమంలో గాయ వడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్ కోసం సోషల్ మీడియాలో విరాళాల కోసం పిలుపునివ్వగా ఒక్కరోజులోనే 133 లక్షల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 1.20 కోట్ల రూపాయలకు పైగా వచ్చాయి. కాగా, ముందుగా ప్రచారమైనట్లు అహ్మద్ పండ్ల దుకాణం నడ పటం లేదని, పోగాకు ఉత్పత్తులు విక్రయించే ప్రత్యేక కన్వీనియన్స్ స్టోర్ నడుపుతున్నట్లు తేలింది. అతడు సిరియా నుంచి వచ్చి ఇక్కడ కుటుంబంతో జీవిస్తున్నాడు.మరొకవైపు సిడ్నీ బోండీ బీచ్‌లో హనుక్కా వేడుకల సమయంలో జరిగిన సామూహిక కాల్పులు ఇస్లామిక్ స్టేట్ ప్రభావంతో జరిగిన ఉగ్రదాడే అని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్ క్రిస్సీ బారెట్ మంగళవారం చెప్పారు. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
తండ్రి మృతి.. కొడుకుకు చికిత్స...
ఈ ఘటనలో అనుమానితులు తండ్రి, కొడుకు అని అధికారులు తెలిపారు. వారి వయసులు 50, 24 సంవత్సరాలు. ఘటన అనంతరం తండ్రిని పోలీసులు కాల్చిచంపగా, కొడుకును ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారులు తొలిసారిగా అనుమానితుల భావజాలంపై మాట్లాడారు. స్వాధీనం చేసుకున్న వాహనంలో ఇస్లామిక్ స్టేట్ జెండాలు లభించినట్లు చెప్పారు. దాడికి సంబంధించి సేకరించిన ఆధారాలే ఈ నిర్ధారణకు కారణమని వివరించారు. ఆదివారం జరిగిన ఈ హత్యాకాండ తర్వాత ఇప్పటికీ 25 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News