బడ్జెట్ దెబ్బకు బంగారం...?

కేంద్ర బడ్జెట్ కారణంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.500లు పెరిగింది.

Update: 2023-02-02 03:22 GMT

కేంద్ర బడ్జెట్ దెబ్బకు బంగారం ధరలకు రెక్కలు రానున్నాయి. బంగారం, వెండి ధరలపై కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచింది. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరగనున్నాయి. బంగారం అంటే అంతే మరి. మార్కెట్ నిపుణుల అంచనా మేరకు పది గ్రాముల బంగారం ధర ఈ ఏడాదిలో ఎనభై వేలకు దాటుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. పెరుగుతున్న బంగారం ధరలు సామాన్య, పేద వర్గాలకు భారంగా మారనున్నాయి. బంగారం కొందరికే పరిమితమైన వస్తువుగా మారనుంది.

వెండి కూడా భారీగా...
తాజాగా కేంద్ర బడ్జెట్ కారణంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.500లు పెరిగింది. కిలో వెండి పై రూ.1000లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,870 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 73,300 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News