మహిళలకు షాక్... రెండో రోజు కూడా బంగారం ధరలు?
దేశ వ్యాప్తంగా బంగారం ధర పెరిగింది. పది గ్రాముల బంగారం పై 430 రూపాయలు పెరిగింది
ధరలు తగ్గుతాయని వెయిట్ చేస్తే తగ్గని వస్తువుల్లో బంగారం ఒకటి. బంగారానికి అంతర్జాతీయంగా అంత డిమాండ్ ఉంది. ముఖ్యంగా భారత్ లో బంగారం అంటే మహిళలు బాగా ఇష్టపడతారు. తాము దాచుకున్న కొంత మొత్తంతోనైనా బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఇష్పపడతారు. అందుకే ధరలు తగ్గినప్పుడల్లా కొనుగోళ్లు ఎక్కువ ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. గత రెండు రో్జులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
ధరలు ఇలా....
తాజాగా దేశ వ్యాప్తంగా బంగారం ధర పెరిగింది. పది గ్రాముల బంగారం పై 430 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు 45,550 రూపాయలు ఉంది. అదే 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,700 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరలు కూడా బాగా పెరిగాయి. కిలో వెండిపై 1400 రూపాయలు పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర 64,600 రూపాయలుగా ఉంది.