బంగారం ధరలు ఇలా... స్థిరంగానే

దేశ వ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్వల్పంగా పెరుగుదల కన్పించింది.

Update: 2021-12-14 01:07 GMT

అనుకున్నట్లే జరుగుతుంది. వరసగా ప్రతి రోజూ బంగారం ధర కొంత పెరుగుతూనే వస్తుంది. భారీ స్థాయిలో కాకపోయినా గ్రాముకు రూపాయి చొప్పునయినా పెరుగుతూనే ఉంది. అంటే బంగారం ధర ఇక రానున్న రోజుల్లో పెరుగుదల తప్పించి తగ్గుదల ఉండదని నిపుణులు సయితం చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఎలాంటి ఒడిదుడుకులున్నప్పటికీ బంగారం ధరలో మాత్రం తగ్గుదల ఉండదంటున్నారు. తాజాగా బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్వల్పంగా పెరుగుదల కన్పించింది.

హైదరాబాద్ లో...
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,120 రూపాయులుండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,220 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News