నేడు శ్రీశైలానికి రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు శ్రీశైలం ఆలయానికి రానున్నారు. అనంతరం తెలంగాణకు రానున్నారు.

Update: 2022-12-26 02:29 GMT

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు శ్రీశైలం ఆలయానికి రానున్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆమె కేంద్ర పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ప్రసాద్ పథకలో భాగంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర్రపతి పర్యటన సందర్భంగా శ్రీశైలంలో ప్రత్యేకంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం కర్నూలు చేరుకుని ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్పోర్స్ స్టేషన్ కు చేరుకుంటారు.

శీతకాలం విడిది...
శీతకాలం విడిదిలో భాగండా ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకోనున్నారు. తొలుత బొల్లారం వార్ మెమోరియల్లో అమరజవాన్లకు నివాళులర్పించిన అనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. రాత్రికి రాజ్భవన్ లో జరిగే విందులో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ నెల 30 వ తేదీ వరకూ ద్రౌపది ముర్ము హైదరాబాద్ లోనే ఉ:టారు. రాష్ట్రపతి రాక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.


Tags:    

Similar News