బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం : ప్రధాని మోదీ

మోదీ వెంట కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు..

Update: 2023-06-03 13:40 GMT

pm modi

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం రాత్రి షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ఈ ప్రమాదంలో సుమారు 300 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. 1000 మందికి పైగా క్షతగాత్రులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ప్రధాని అక్కడి అధికారులతో మాట్లాడారు. అలాగే బాలాసోర్, కటక్ లోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

మోదీ వెంట కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద స్థలాన్ని చూసిన తర్వాత మాట్లాడేందుకు మాటలు రావడం లేదన్నారు. మూడు రైళ్ల ప్రమాదంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఇది ప్రమాదం చాలా సీరియస్ విషయమని, అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రమాదానికి బాధ్యులెవరైనా సరే ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని, కఠిన శిక్ష పడుతుందని మోదీ వెల్లడించారు.


Tags:    

Similar News