సెంగోల్ ప్రతిష్టాపనతో నూతన పార్లమెంట్ ను ప్రారంభించిన ప్రధాని

మఠాధిపతుల ఆశీర్వచనంతో సెంగోల్ ప్రతిష్టాపన చేశారు. అనంతరం నూతన పార్లమెంట్ భవన కార్మికులను ప్రధాని శాలువాలతో ..

Update: 2023-05-28 03:46 GMT

దేశరాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తొలుత పార్లమెంట్ భవనంలో లోక్ సభ స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్ (రాజదండం)ను ప్రతిష్టించారు. మఠాధిపతుల ఆశీర్వచనంతో సెంగోల్ ప్రతిష్టాపన చేశారు. అనంతరం నూతన పార్లమెంట్ భవన కార్మికులను ప్రధాని శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. నూతన పార్లమెంట్ ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు కొనసాగుతున్నాయి. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో వివిధ రాష్ట్రాల సీఎంలు, లోక్ సభ స్పీకర్, ప్రజా ప్రతినిధులు, బీజేపీ నేతలు పాల్గొంటున్నారు.

2020 డిసెంబర్​ 10న పార్లమెంట్‌ నూతన భవనంకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన విషయం విధితమే. ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని 64,500 చదరపు మీటర్ల పరిధిలో, నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. ఇందులో ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. లోక్​సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు ఉన్నాయి. ఎంపీలకోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు అందుబాటులో ఉన్నాయి.


Tags:    

Similar News