ప్రమాదంలో 227 మంది ప్రాణాలు బుద్ధి చూపించిన పాకిస్థాన్!!
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం సాయంత్రం గగనతలంలో తీవ్రమైన కుదుపులకు లోనైంది.
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం సాయంత్రం గగనతలంలో తీవ్రమైన కుదుపులకు లోనైంది. విమానం ముక్కు భాగం దెబ్బతిన్నప్పటికీ శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు . విమానం అమృత్‌సర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వడగళ్ల వానతో కూడిన తుఫానులో చిక్కుకుంది. విమానం తీవ్రమైన కుదుపులకు గురైంది.
పైలట్ సమీపంలోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను సంప్రదించి, తుఫాను నుంచి తప్పించుకునేందుకు తమ విమానాన్ని కొద్దిసేపు పాకిస్థాన్ గగనతలంలోకి అనుమతించాలని కోరారు. పాకిస్థాన్ ఏటీసీ అధికారులు ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు పీటీఐ తెలిపింది. పైలట్ నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇండిగో వర్గాలు తెలిపాయి.