శ్రీనగర్ ఎయిర్ పోర్టు సమీపంలో పాక్ దాడులు
శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు సమీపంలో క్షిపణి దాడితో పాక్ ప్రయత్నించింది.
గత రెండు రోజుల నుంచి రాత్రి పూట దాడులకు దిగుతున్న పాక్ ఈరోజు మాత్రం పగటి పూట దాడులకు దిగింది. తాజాగా శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు సమీపంలో క్షిపణి దాడితో పాక్ ప్రయత్నించింది. రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతన్నారు. ఈ శబ్దాలతో స్థానికులు భయంతో వణికపోయారు. భయాందోళనలకు గురయ్యారు. ఉదయం పూటే శ్రీనగర్ లో బ్లాక్ అవుట్ ను అధికారులు ప్రకటించారు. విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు.
పేలుడు శబ్దం వినిపించిన వెంటనే...
పేలుళ్ల శబ్దం వినిపించిన వెంటనే భద్రతాదళాలు సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దంటూ సూచనలు చేశారు. అలాగే అవంతిపురం సమీపంలోనూ ఐదుసార్లు భారీ పేలుడు సంభవించింది. శ్రీనగర్ లోని దాల్ సరస్సులో క్షిపణి పడిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఎయిర్ బేస్ పై దాడికి ప్రయత్నించగా భారత సైన్యం దానిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ప్రజలు ఇళ్లలోని బాల్కనీలోకి కూడా రావద్దని, ఇళ్లలోనే ఉండాలని అధికారులు చెప్పారు. పంజాబ్ లోని బఠిండాలోనూ రెడ్ అలెర్ట్ ను జారీ చేశారు.