Pahalgam Incident : ఒక్కరోజులో జమ్మూకాశ్మీర్ టిక్కెట్లను ఇంత మంది రద్దు చేసుకున్నారా?

పహాల్గామ్ ఘటన పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Update: 2025-04-24 05:19 GMT

పహాల్గామ్ ఘటన పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జమ్మూ కాశ్మీర్ కు వెళ్లేందుకు ముందుగానే బుక్ చేసుకున్న టిక్కెట్లను చాలా మంది రద్దు చేసుకుంటున్నారు. పహాల్గామ్ ప్రాంతంలోనూ జమ్మూ కాశ్మీర్ లోనూ ఉగ్రవాదులు మాటు వేసి ఉన్నారన్న నిఘా సమారం అందడంతో పాటు దాదాపు అన్ని ప్రాంతాల్లో భారత సైన్యం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తుండటంతో భయానక వాతావరణం ఏర్పడింది. మరికొందరు తమ టిక్కెట్ల డేట్స్ ను పోస్ట్ పోన్డ్ చేసుకున్నట్లు తెలిసింది.

తిరుగు ప్రయాణమయిన వారు...
దీంతో అనేక మంది ఇప్పటికే తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ కు ముందుగా బుక్ చేసుకున్న దాదాపు పదిహేను వేల ఎయిర్ లైన్ టిక్కెట్లు రద్దయినట్లు చెబుతున్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పర్యాటకులు కూడా రాష్ట్రాన్ని వదిలేసి తమ సొంత ప్రాంతాలకు బయలుదేరారు. వీరికోసం ప్రత్యేక విమానాలను భారత విమానయాన శాఖ ఏర్పాటు చేసింది. హహల్గామ్ ఘటన ప్రభావం జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగంపై మరికొంత కాలం ఉంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి.


Tags:    

Similar News