నేడు రాష్ట్రపతి భవన్‍లో పద్మ అవార్డుల ప్రదానం

నేడు రాష్ట్రపతి భవన్‍లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

Update: 2025-04-28 04:12 GMT

నేడు రాష్ట్రపతి భవన్‍లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికయిన వారు రాష్ట్రపతి భవన్ కు చేరుకోనున్నారు.

అవార్డు అందుకోనున్న బాలకృష్ణ
అయితే నేడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులు కూడా పాల్గొననున్నారు. వీరితో పాటు మిగిలిన పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందచేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు కేంద్ర, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.


Tags:    

Similar News