ఒమిక్రాన్ వ్యాప్తికి ప్రధాన కారణం ప్లాస్టిక్..ఎంతసమయం సజీవంగా ఉంటుందంటే..

తాజాగా ఒమిక్రాన్ వైరస్ మనిషి శరీరంపై ఎంతసమయం ఉంటుంది ? ప్లాస్టిక్ పై ఎంత సమయం ఉంటుంది? అన్న అంశాలు బయటపడ్డాయి. గతంలో వచ్చిన వైరస్ లకు

Update: 2022-01-27 08:58 GMT

ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై పలువురు వైద్య నిపుణులు అధ్యయనాలు చేస్తున్నారు. ప్రతినిత్యం ఒమిక్రాన్ గురించి ఏదొక కొత్తవిషయం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా ఒమిక్రాన్ వైరస్ మనిషి శరీరంపై ఎంతసమయం ఉంటుంది ? ప్లాస్టిక్ పై ఎంత సమయం ఉంటుంది? అన్న అంశాలు బయటపడ్డాయి. గతంలో వచ్చిన వైరస్ లకు భిన్నంగా ఒమిక్రాన్ వైరస్.. మనిషి శరీరంపై 21 గంటలపాటు సజీవంగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

అదేవిధంగా ప్లాస్టిక్ పై ఏకంగా 8 రోజులపాటు ఒమిక్రాన్ వైరస్ సజీవంగా ఉంటుందని తేలింది. దీంతో ఓమిక్రాన్ వైరస్ ప్రభావం ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే గతంలో వచ్చిన కరోనా వేరియంట్లేవీ.. మనిషి శరీరంపై గానీ.. ప్లాస్టిక్ పై గానీ ఇంత సమయం సజీవంగా లేవని ఈ అధ్యయనంలో తేలింది. ఇతర వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ వేగంగా విస్తరించడానికి ప్రధాన కారణం ఇదేనని అధ్యయనం చెప్తోంది. కాబట్టి ఒమిక్రాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, వీలైనంతవరకూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News