నేడు భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. రెండున్నర లక్షల కేసులు దాటేశాయి
భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. రెండున్నర లక్షల కేసులు దాటేశాయి. ఈరోజు కొత్తగా 2,68,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 403 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,59,42, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం దేశంలో 14,17,820 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,03,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,84,925 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,55,94,66,674 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 6041 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ రేటు 16,66 శాతంగా ఉంది.