కరోనా స్పీడ్ పెంచింది.. ఈ ఒక్కరోజే రెండున్నర లక్షలు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈరోజు కొత్తగా 2,47,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. రెండున్నర లక్షలకు చేరువలో ఉన్నాయి. ఈరోజు కొత్తగా 2,47,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 380 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,57,22, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వ్యాక్సినేషన్ ...
ప్రస్తుతం దేశంలో 11,17,531 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,87,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,84,523 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,54,94,66,674 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
ఒమిక్రాన్ కేసులు...
దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 5,488 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 1,367 కేసులున్నాయి. రాజస్థాన్ లో 793, ఢిల్లీలో 592, కేరళలో 486 ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.