12 లక్షల లోపు ఆదాయం ఉంటే.. నో ఇన్కమ్ టాక్స్

Update: 2025-02-01 06:51 GMT

12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్లు ఇకపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇది మధ్య తరగతి ప్రజలకు, ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ గా చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతూ ఉన్నారు. అనుకున్నట్లుగానే నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. 

2025-26 ఏడాది వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నిర్మాలా సీతారామన్‌, ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే. బడ్జెట్‌పై ఆసక్తిగా పేదలు, మధ్య తరగతి, వేతన జీవులు ఎదురు చూశారు.


Tags:    

Similar News