వంతెన కూలిన ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

గుజరాత్ లో వంతెన కూలిన ఘటనలో 9 మంది మరణించారు

Update: 2025-07-09 08:32 GMT

గుజరాత్ లో వంతెన కూలిన ఘటనలో 9 మంది మరణించారు. ఈరోజు ఉదయం వడోదరలోని పద్రావ వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలోని కొంత భాగం కుప్పకూలింది. దీంతో దానిపై వెళుతున్న రెండు ట్రక్కులుతో పాటు రెండు వ్యాన్యు, మరికొన్ని వాహనాలు నదిలోపడిపోయాయి. దీంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వాహనాల నుంచి కొందరిని సహాయక బృందాలు రక్షించగలిగాయి.

9 మంది మృతి...
1985లో నిర్మించిన ఈ వంతెన పాత పడటంతో పాటు భారీ వర్షాల కారణంగా వంతెన కుప్పకూలిందని చెబుతున్నారు. గుజరాత్ వంతెన కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి యాభై వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఘటనపై గుజరాత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 


Tags:    

Similar News