పాతబస్తీలో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు

జాతీయ భద్రతా ఏజెన్సీ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సోదాలు

Update: 2023-09-16 06:49 GMT

జాతీయ భద్రతా ఏజెన్సీ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. చెన్నై, కోయంబత్తూరుతో పాటు హైదరాబాద్ నగరంలోనూ సోదాలు నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయం పాతబస్తీ సహా నాలుగుచోట్ల ఎన్‌ఐఏ అధికారుల సోదాలు జరగడం చర్చనీయాంశమైంది. ఐఎస్‌ఐ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో ఈ రైడ్స్ నిర్వహించారు. వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్‌ఐఎస్ఐ మాడ్యుల్‌లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. తమిళనాడులోని చెన్నైలో పది ప్రాంతాల్లో, కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన దాడుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వారి సమాచారం బయటకు తీస్తున్నారు అధికారులు. ఎన్ఐఏ అధికారుల చేతికి కొన్ని అరబిక్ కాలేజీల నిర్వహకులు చిక్కారు. తమిళనాడులోని కోయంబత్తూరులో 22 ప్రాంతాల్లో, తమిళనాడు రాజధాని చెన్నైలో మూడు ప్రాంతాల్లో, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు శనివారం ఉదయం సోదాలు ప్రారంభించారు. ఐఎస్ఐఎస్ మాడ్యూల్ కు సంబంధించిన కేసులో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.


Tags:    

Similar News