India : బ్యాంకు ఖాతాలున్నాయా? అయితే మీకు అలెర్ట్

బ్యాంకుల్లో నవంబరు 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.

Update: 2025-10-30 12:26 GMT

బ్యాంకుల్లో నవంబరు 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. బ్యాంకు ఖాతాదారుడి నామినీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కరు నామినీ కాకుండా నలుగురు నామినీలుగా ఉండేందుకు అవకాశం కల్పించింది. ఈ నామినీలకు ఎవరెవరికి ఎంతెంత శాతం డబ్బు కేటాయించాలనేది ఖాతాదారుడు నిర్ణయించుకోవచ్చు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకింగ్‌ సవరణ చట్టం కారణంగా నవంబర్‌ నెలలో కొన్ని మార్పులు జరుగనున్నాయి. బ్యాంక్‌ ఖాతా నామినీలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.

నలుగురు నామినీలకు...
ఖాతాదారుడికి ఒక నామినీ మాత్రమే ఉండటం వల్ల ఆ నామినీ అందుబాటులో లేకపోవడం, నగదు క్లెయిమ్ చేసుకోకపోవడంతో ఆ డబ్బు అలాగే ఉండిపోతుంది. ఇలా మన దేశంలోని మన బ్యాంకుల్లో దాదాపు రూ.67,000 కోట్లకు పైగా డబ్బు అలాగే ఉండిపోయింది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుడికి ఒక్కరు నామినీ కాకుండా.. నలుగురు నామినీలుగా ఉండేందుకు అవకాశం కల్పించింది. ఈ నామినీలకు ఎవరెవరికి ఎంతెంత శాతం డబ్బు కేటాయించాలనేది ఖాతాదారుడు నిర్ణయించుకోవచ్చు. ఖాతాదారుడి నిర్ణయం మేరకు నామినీలకు చివరి మొత్తాన్ని బ్యాంక్ అందజేస్తుంది. ఖాతాదారుడి మరణానంతరం డబ్బు విషయంలో వారసత్వ గొడవలు, చట్టపరమైన సమస్యలు నివారించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రూల్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది.


Tags:    

Similar News