నేటి నుంచి కేంద్రం కొత్త మార్గదర్శకాలు అమలు

అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మార్గదర్శకాలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి

Update: 2022-01-11 04:25 GMT

అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మార్గదర్శకాలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఖచ్చితంగా వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలి. అనంతరం వారికి పరీక్షలు చేసి నెగిటివ్ వచ్చిన తర్వాతనే బయటకు అనుమతిస్తారు. కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలు నేటి నుంచి అమలులోకి రానున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కేసులు పెరుగుతుండటంతో....
భారత్ లో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. రోజులకు లక్షన్నర కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం ఎక్కువ దృష్టి పెట్టింది. వీరంతా ఖచ్చితంగా వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాల్సిందేనన్న నిబంధనను విధించింది.


Tags:    

Similar News