ఆపరేషన్ సింధూర్ - వందమంది ఉగ్రవాదులు హతం
భారత్ జరిపిన దాడుల్లో పాకిస్థాన్ లో తలదాచుకున్న దాదాపు వంద మంది వరకూ ఉగ్రవాదులు మరణించినట్లు తెలిసింది.
భారత్ జరిపిన దాడుల్లో పాకిస్థాన్ లో తలదాచుకున్న దాదాపు వంద మంది వరకూ ఉగ్రవాదులు మరణించినట్లు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్ లోని తొమ్మిది చోట్ల భారత్ సైన్యం దాడులకు దిగింది. కేవలం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడంతో పాక్ లో ఉన్న ఉగ్రవాదులలో కొందరిని సమర్ధవంతంగా మట్టుబట్టుపెట్టగలిగింది. జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్ గా ఉన్న మర్కాజ్ పై దాడి చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ఇక్కడి నుంచే ప్రణాళిక రచించారు.
భారత్ గడ్డపై నుంచి...
భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలసి సంయుక్త ఆపరేషన్ ను ఖచ్చితంగా అమలుచేసింది. పకడ్బందీగా అనుకన్న లక్ష్యాన్ని ఛేదించింది. డ్రోన్లు ఇతర ఆయుధాలను వినియోగించినట్లు భారత సైన్యం పేర్కొంది. భారత్ భూభాగంపై నుంచే ఈ దాడులు నిర్వహించింది. పూర్తి సమాచారాన్ని ఉదయం పది గంటలకు ఆపరేషన్ సింధూర్ పై రక్షణ శాఖ మీడియా సమావేశంలో మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు. పాక్ కవ్వింపు చర్యలకు దిగితే తాము కూడా ప్రతి చర్యలకు దిగుతామని హెచ్చరించనుంది.