Pehalgam Attack : నేడు హహల్గామ్ ఉగ్రదాడి పై ఎన్.ఐ.ఏ రిపోర్ట్

హహల్గామ్ ఉగ్రదాడి పై కేంద్ర ప్రభుత్వానికి ఎన్.డి.ఏ రిపోర్ట్ ఇవ్వనుంది.

Update: 2025-05-04 02:28 GMT

హహల్గామ్ ఉగ్రదాడి పై కేంద్ర ప్రభుత్వానికి ఎన్.ఐ. ఏ రిపోర్ట్ ఇవ్వనుంది. పహల్గామ్ లో లో ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్న ఘటన పై ఎన్.ఐ. ఏవిచారణ జరిపింది. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించింది. వీడియో ఫుటేజీలను కూడా సేకరించి దానిని నిశితంగా పరిశీలించింది. అదే సమయంలో ఆ సమయంలో ఉన్న టూరిస్ట్ లను కూడా ప్రశ్నించింది.

మూడు వేల మందిని విచారించి...
పహల్గామ్ దాడి విషయంలో ఎన్.డి.ఏ ఇప్టపి వరకూ దాదాపు మూడు వేల మందిని ప్రశ్నించింది. ఎన్నింటికి ఉగ్రవాదులు వచ్చారు? ఏ డ్రెస్ లో వచ్చారు? ఏ రకంగా అటాక్ చేశారు? దాడి చేసిన సమయంలో వారు అన్న మాటలను అన్నింటినీ రికార్డు చేసి విశ్లేషించి ంది. దేశంలో వందకు పైగా ప్రాంతాల్లోసోదాలు నిర్వహించిన బలగాల నుంచి కూడా సేకరించిన విషయాలపై రిపోర్టును తయారు చేసి నేడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. దీనికి సంబధించి ఇప్పికే 90 ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసు నమోదయ్యాయి.


Tags:    

Similar News