నేడు ఎన్డీఏ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
నేడు ఎన్డీఏ పక్ష సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు
నేడు ఎన్డీఏ పక్ష సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఏన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు చెందిన ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఏడాది పాలనపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై సమావేశంలో చర్చ జరగుతుంది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
పలు కీలక అంశాలపై...
దాదాపు ఇరవై మంది ముఖ్యమంత్రులు, పద్దెనిమిది మంది ఉప ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఏపీ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు ఎన్డీఏ సమావేశం ప్రధాని మోదీని ఈ సమావేశంలో అభినందించనున్నారు. తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం దశాబ్దం పూర్తవుతున్న నేపథ్యంలో దాని పై చర్చింస్తారు. మరికొన్ని రాజకీయ అంశాలు కూడా చర్చించే అవకాశముంది.