వారికి నవీన్ స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తున్నట్లు ప్రకటించారు

Update: 2022-10-16 04:20 GMT

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారరు. కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తున్నట్లు ప్రకటించారు. తన 76వ పుట్టినరోజు సందర్భంగా నవీన్ పట్నాయక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న 57 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఆయన బర్త్ డే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక వరంగా మారింది.

రెగ్యులరైజ్ చేస్తూ...
ఇకపై ఒడిశాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండబోవని నవీన్ పట్నాయక్ తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు నవీన్ పట్నాయక్ ప్రకటించారు. కేబినెట్ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై అదనంగా ఏట రూ. 1300 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులందరూ సంబరాలు చేసుకున్నారు.


Tags:    

Similar News