220 మందికి పైగా ప్రయాణీకులు.. వడగళ్ల వాన.. ముందు భాగం చూస్తే!!

Update: 2025-05-22 09:18 GMT

ఫ్లైట్ 

220 మందికి పైగా ప్రయాణికులతో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ బయల్దేరిన ఇండిగో విమానానికి పెనుప్రమాదం తప్పింది. భారీ వర్షం, వడగళ్ళు, ఈదురు గాలుల కారణంగా విమానం భారీ కుదుపులకు లోనైంది. అందులోని ప్రయాణీకులు బతుకుతామా లేదా అని భయపడిపోయారు.


పైలట్‌ అత్యవసరంగా లాండింగ్ చేయాలంటావు శ్రీనగర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ను సంప్రదించాడు. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య బుధవారం సాయంత్రం 6.30కు విమానాన్ని సురక్షితంగా లాండ్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అది లాండింగ్‌కు ముందే విరిగిపోయిందని ప్రయాణీకులు తెలిపారు.

Tags:    

Similar News