శివునిపై భక్తితో పదేళ్లుగా చేతిని పైకెత్తి ఉంచిన సాధువు..

గతంలో అమర్ భర్తీ అనే 70 ఏళ్ల సాధువు ఏకంగా 50 ఏళ్లకుపైగా తన చేతిని ఎత్తి ఉంచిన వార్తలు వచ్చాయి. అమర్ భర్తీ కూడా ..

Update: 2022-09-26 13:15 GMT

సాధువులు శివుడి భక్తులు. శివనామస్మరణ చేసుకుంటూ దొరికింది తింటూ బతికేస్తారు. ఓ సాధువు శివుడిపై తనకున్న అపారమైన భక్తితో పదేళ్లుగా తన కుడిచేతిని పైకెత్తే ఉంచాడు. మామూలుగా చేతిని పైకెత్తి 10 నిమిషాల నుంచి అరగంట పాటు ఉండగలరేమో. అంతకుమించి చేతిని పైకెత్తి ఉంచడం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటిది ఈ సాధువు తన చేతిని పదేళ్లుగా పైకెత్తే ఉంచడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రేయింబవళ్లు అతను ఇలాగే ఉంటుండటం విశేషం. తాజాగా ఆ సాధువు మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

తనకు సాధ్యమైనంత మేరకు చేతిని పైకి ఎత్తే ఉంచుతానని ఈ సాధువు పేర్కొన్నారు. పదేళ్లకుపైగా తాను చేతిని పైకి ఎత్తే ఉంచానని అలా ఎత్తే ఉంచేస్తానని తెలిపారు. చేతిని పైకి ఉంచే నిద్రపోతానని వివరించారు. గతంలో అమర్ భర్తీ అనే 70 ఏళ్ల సాధువు ఏకంగా 50 ఏళ్లకుపైగా తన చేతిని ఎత్తి ఉంచిన వార్తలు వచ్చాయి. అమర్ భర్తీ కూడా శివుడిపై తనకున్న భక్తితో తన జీవితాన్ని ఆ పరమాత్ముడికే అంకితం చేయాలన్న ఉద్దేశ్యంతో తన చేతిని పైకెత్తి ఉంచారు. మొదట రెండేళ్లు తీవ్రంగా నొప్పి ఉండేదని, తర్వాత తగ్గిపోయిందని ఆయన చెప్పేవారు.
కాగా.. చేతిని ఇలా పైకెత్తే ఉంచడంపై వైద్యులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇలా చేయి ఎత్తి పట్టుకోవడం వల్ల క్రమంగా ఆ చేతికి రక్త ప్రసరణ నిలిచిపోయి గట్టిపడిపోతుందని, ఫలితంగా నొప్పి ఉండదని చెబుతున్నారు.



Tags:    

Similar News