నేడు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
ఉత్తరాఖండ్ లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉత్తరాఖండ్ లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. ప్రయాణికులు తగిన జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది.
డెహ్రాడూన్ లో నేడు విద్యాసంస్థలకు సెలవు...
డెహ్రాడూన్ లో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాల సూచనల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడమే మంచిదని తెలిపారు. సహాయక బృందాలను సిద్ధంగా ప్రభుత్వం ఉంచింది. ఇప్పటికే భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. నదులు, వాగులు పొంగిపొరలుతున్నాయి.