Union Cabinet : నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముందని తెలిసింది. మహ్యాహ్నం ఒంటిగంటకు సమావేశమయ్యే మంత్రివర్గంలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్ జరిగిన నష్టంపై కూడా చర్చించే అవకాశముందని తెలిసింది.
కీలక అంశాలపై...
దీంతో పాటు ప్రభుత్వోద్యోగులు, రైతులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశముంది. దీంతో పాటు దీపావళి నుంచి జీఎస్టీ సంస్కరణలను తీసుకు వస్తామని ప్రధాని ఆగస్టు పదిహేనో తేదీన ప్రకటించడంతో దానిపై కూడా చర్చించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో పాటు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.