Union Cabinet : నేడు ప్రధాని కీలక సమావేశం.. మంత్రులతో భేటీ
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అమెరికాతో ట్రేడ్ వార్ జరగకుండా అన్ని చర్యలు తీసుకునే అవకాశముంది. అమెరికా విధించిన సుంకాల కారణంగా భారత్ లో ఉత్పత్తులను ఎగుమతులు చేయడం కష్టమవుతుందని ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతుంది. భారత్ లోని ఫార్మారంగం, ఆక్వారంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
అమెరికా పెంచిన సుంకాలపై...
స్టాక్ మార్కెట్ లు కూడా డౌన్ అయిపోతున్న నేపథ్యంలో నేడు కీలక నిర్ణయం యూనియన్ కేబినెట్ తీసుకునే అవకాశముంది. నేటి నుంచి అమెరికా టారిఫ్ మరో పదహారు శాతం పన్నులు పెరగపోతున్నాయి. అమెరికా ఆలోచనలకు అనుగుణంగా ఆ దేశంతో సయోధ్యతతో కొనసాగుతూనే నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో భాగంగా ఈరోజు కీలకంగా చర్చించే అవకాశముందని తెలిసింది.