మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర

నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000..

Update: 2023-05-24 03:25 GMT

gold and silver prices today

మగువలకు ఎంతో ఇష్టమైనది బంగారం. డబ్బులున్నప్పుడు కొనుక్కోవాలనుకునే వాటిలో బంగారానికే మొదటి ప్రాధాన్యమిస్తారు. ఇటీవల బంగారం ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో.. కాస్త ధర తగ్గినపుడు కొనుగోలు చేయాలని ఎదురుచూసేవారెందరో ఉన్నారు. అలాంటి మగువలకు గుడ్ న్యూస్. దేశీయ మార్కెట్లో బంగారం ధర కాస్త దిగొచ్చింది. బుధవారం ఉదయం 6 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 తగ్గి రూ.56,000కు చేరింది. అలాగే 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధరపై రూ.310 తగ్గి రూ.61,100 కు దిగి వచ్చింది. వెండి ధర కూడా కాస్త తగ్గింది.

నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,100కు తగ్గింది. ఏపీలోని విజయవాడవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి తదితర ప్రధాన నగరాల్లో, ఆర్థిక రాజధాని ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధరపై రూ.500 తగ్గి రూ.78,000 దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,150 ఉండగా..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,150 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,450 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,580గా ఉంది.


Tags:    

Similar News