స్పెల్లింగ్ బీ విజేతగా మళ్లీ మనోడే!!

అమెరికాలో స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ అంటే చాలు భారత సంతతికి చెందిన పిల్లలు సత్తా చాటుతూ ఉంటారు.

Update: 2025-05-31 11:29 GMT

spelling bee

అమెరికాలో స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ అంటే చాలు భారత సంతతికి చెందిన పిల్లలు సత్తా చాటుతూ ఉంటారు. ఈ ఏడాది కూడా భారత-అమెరికన్‌ విద్యార్థుల హవా కొనసాగింది. ఈ పోటీల్లో హైదరాబాద్‌ మూలాలున్న బాలుడు విజేతగా నిలిచాడు. టెక్సాస్‌లో ఉంటున్న 13 ఏళ్ల ఫైజాన్‌ జాకీ 21వ రౌండ్‌లో స్పెల్లింగ్‌ను సరిగా చెప్పి విజేతగా నిలిచాడు.


కాలిఫోర్నియాకు చెందిన మరో భారత సంతతి బాలుడు సర్వజ్ఞ కదమ్‌ రన్నరప్ గా నిలిచాడు. ఈ పోటీలో విజేతగా నిలవడం వల్ల 50,000 డాలర్ల నగదు, ట్రోఫీ సహా మెరియమ్‌ వెబ్‌స్టర్‌ నుంచి 2,500 డాలర్ల బహుమతిని జాకీ అందుకున్నాడు. తన విజయాన్ని తల్లిదండ్రులతోపాటు హైదరాబాద్‌లో ఉండే తాతయ్య, నానమ్మలకు అంకితం చేస్తానని జాకీ తెలిపాడు.

Tags:    

Similar News