Maha Kumbh Mela : మహా కుంభమేళాలో 30 కోట్లు సంపాదించిన కుటుంబం గురించి తెలుసా?
ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా దాదాపు నలభై ఐదు రోజుల పాటు సాగింది.
ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా దాదాపు నలభై ఐదు రోజుల పాటు సాగింది. అయితే ఈ కుంభమేళాలో ఒక కుటుంబం ముప్ఫయి కోట్ల రూపాయలను సంపాదించినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ వెల్లడించారు. శాసనసభ సాక్షిగా ఆయన ఈ విషయం తెలిపారు. ప్రయాగ్ రాజ్ లో ఒక కుటుంబానికి 130 పడవలున్నాయని, ఒక్కొక్క పడవకు రోజుకు యాభై వేల రూపాయల నుంచి యాభై రెండు వేల రూపాయల వరకూ సంపాదించినట్లు తెలిపారు. ఈ కుటుంబానికి మొత్తం 30 కోట్ల రూపాయలు వచ్చినట్లు అసెంబ్లీలో యోగి ఆదిత్యానాధ్ తెలిపారు.
నలభై ఐదు రోజుల పాటు...
మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 65 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. అయితే పుణ్యస్నానాలు చేయడానికి పడవల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపించారని, అందువల్లనే ఈ కుటుంబం అంత మొత్తాన్ని ఆర్జించగలిగిందని తెలిపారు. మొత్తం మీద ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళాలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. అనేక వ్యాపారాలతో తమ జీవనస్థితికి మెరుగుపర్చుకున్నారని యోగి ఆదిత్యానాధ్ తెలిపారు.