ఖరగ్ పూర్ రైల్వేస్టేషన్లో విషాద ఘటన.. చూస్తుండగానే టీటీఈ కి విద్యుత్ షాక్
అతడితో మాట్లాడుతున్న మరోవ్యక్తి మాత్రం తృటిలో తప్పించుకున్నాడు. బాధిత టీటీఈ సుజన్ సింగ్ సర్దార్ ను హుటాహుటిన..
kharagpur railway station incident
పశ్చిమబెంగాల్ లోని ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్లాట్ ఫారమ్ పై మరో వ్యక్తితో నిల్చుని మాట్లాడుతున్న టీటీఈ తలపై హైటెన్షన్ వైర్ (ఓహెచ్ఈ వైరు) తెగి పడటంతో.. ఆయన అమాంతం వెనుక ఉన్న ట్రాక్ పై కుప్పకూలిపోయారు. ఈ ఘటన అక్కడి స్టేషన్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అతడితో మాట్లాడుతున్న మరోవ్యక్తి మాత్రం తృటిలో తప్పించుకున్నాడు. బాధిత టీటీఈ సుజన్ సింగ్ సర్దార్ ను హుటాహుటిన రైల్వే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై ఖరగ్‌పూర్ టీఆర్ఎం మహమ్మద్ సుజత్ హష్మీ మాట్లాడుతూ.. అదృష్టవశాత్తు టీటీఈ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. వైరు తెగి పడడానికి ఖచ్చితమైన కారణం తెలియదని, బహుశా పక్షుల ఇలా జరిగి ఉండవచ్చన్నారు. కాగా.. ప్రమాదంలో సుజన్ తలతోపాటు ఆయన శరీరంలోని పలుచోట్ల తీవ్రగాయాలైనట్టు వైద్యులు వెల్లడించారు.