మహారాష్ట్రలో లాక్ డౌన్ తప్పదా?

తాజాగా మహారాష్ట్రలో 18,466 కేసులు నమోదయ్యాయి. ఇరవై మంది కరోనాతో మరణించడం ఆందోళన కల్గిస్తుంది

Update: 2022-01-05 02:27 GMT

దేశంలో కరోనా తో వణికిపోతున్న రాష్ట్రం మహారాష్ట్ర. సెకండ్ వేవ్ లోనూ మహారాష్ట్ర అన్ని రకాలుగా ఇబ్బంది పడింది. తాజాగా ఇప్పుడు కూడా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఎన్ని ఆంక్షలు విధించినా కేసుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. లాక్ డౌన్ పెడితేనే మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటీవల పది మంది మంత్రులు, ఇరవై మంది ఎమ్మెల్యేలకు కూడా కరోనా సోకింది.

అత్యధికంగా....
తాజాగా మహారాష్ట్రలో 18,466 కేసులు నమోదయ్యాయి. ఇరవై మంది కరోనాతో మరణించడం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటికీ మహారాష్ట్రలో 66,308 యాక్టివ్ కేసులున్నాయి ఇక ముంబయి నగరంలోనే 10,860 కేసులున్నాయి. తాజాగా ఒమిక్రాన్ కేసులు 75 వెలుగు చూశాయి. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు చేరుకుంది. రోజుకు ఇరవై కేసులు దాటితే లాక్ డౌన్ పెట్టక తప్పదని నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News