Maha Kumbhamela : పదకొండు రోజుల్లో ప్రయాగ్ రాజ్ కు ఎంత మంది వచ్చారో తెలుసా?
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాకు అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాకు అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇప్పటివరకూ పది కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పది కోట్ల మంది ప్రయాగ్ రాజ్ వచ్చి పుణ్యస్నానాలు చేశారని అధికారులు తెలిపారు. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈకుంభమేళాకు వెళ్లేందుకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా అధిక సంఖ్యలో ప్రజలు హాజరై పుణ్యస్నానాలు ఆచరించారు.
13న ప్రారంభమయిన...
ఈ నెల 13వ తేదీన ప్రయాగరాజ్ లో ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకూ జరగనుంది. ఎల్లుండి ఎక్కువ మంది యాత్రికులు తరలి వస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ మహాకుంభమేళాకు దాదాపు నలభై ఐదుకోట్ల మంది వస్తారని అంచనా వేసిన ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసింది. వైద్యంతో పాటు భద్రతపరమైన చర్యలు కూడా తీసుకుంది. యాత్రికులతో పాటు సాధువులు కూడా అత్యధిక సంఖ్యలో హాజరవ్వడంతో ఆధ్మాత్మిక వాతావరణం అలుముకుంది.