కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది
కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై ఉన్న నిషేధాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. పలు నిబంధలు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం సూచించింది. కర్ణాటకలో ట్యాక్సీ సేవలను నిలిపివేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎత్తివేసింది.
కమర్షియల్ వెహికల్స్ గానే...
తాజాగా అమలవుతున్న కొత్త నిబంధనల ప్రకారం.. బైక్ ట్యాక్సీలను ఇకపై వాణిజ్య వాహనాలుగా పరిగణిస్తారు. అంతేకాకుండా బైక్‌లపై పసుపు బోర్డు ఉపయోగించాల్సి ఉంటుంది. గతేడాది జూన్‌లో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బేక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తిరిగి హైకోర్టు ఉత్తర్వులతో కర్ణాటకలో బైక్ ట్యాక్సీలు నడవనున్నాయి.