కాంగ్రెస్ గ్యారంటీ కార్డు ఇదే

కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫేస్టో విడుదల చేసింది. గ్యారంటీ కార్డు పేరుతో ఐదు ముఖ్యమైన హామీలను ప్రజల ముందు ఉంచింది

Update: 2023-05-02 04:57 GMT

కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫేస్టో విడుదల చేసింది. గ్యారంటీ కార్డు పేరుతో ఐదు ముఖ్యమైన హామీలను ప్రజల ముందు ఉంచింది. రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇస్తామని ప్రకటించింది. మహిళలకు పది కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఐదు హామీలు....
నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు, డిప్లొమా చేసిన వారికి పదిహేను వందలు నెలకు ఇస్తామని ప్రకటించింది. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే మ్యానిఫేస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. మ్యానిఫేస్టోను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు విడుదల చేశారు.


Tags:    

Similar News