భారీగా పెరిగిన వంట నూనెల ధరలు
పశ్చిమాసియా యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు పెరిగాయి
పశ్చిమాసియా యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు పెరిగాయి. జనవరితో పోలిస్తే వంటనూనెల ధరలు ఫిబ్రవరిలో ఇంకాస్త పెరిగినప్పటికీ మార్చిలో మరింత భగ్గుమంటున్నాయి. లీటర్ పామోలిన్ ధర 145 రూపాయలుగా ఉంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 175రూపాయిలకు చేరింది.
బ్రాండ్ ను బట్టి...
అయితే బ్రాండ్‌ని బట్టి ధరలు మారుతున్నాయి. సన్‌ఫ్లవర్ నూనెపై 21 రూపాయలు, పామోలిన్‌పై పన్నెండు రూపాయలు, వేరుశనగ నూనెపై పదహారు రూపాయల చొప్పున పెరిగాయి. రాబోయే రోజుల్లో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.