Kaleswaram : ప్రభుత్వం చేతిలో కాళేశ్వరం కమిషన్ నివేదిక
కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. జ
కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదిక అందచేసింది. గత ఏడాది మార్చి 14వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేయడానికి కమిషన్ ను ఏర్పాటు చేసింది. పదిహేను నెలల పాటు కమిషన్ ఇంజినీరింగ్ నిపుణులతో పాటు రిటైర్డ్ అధికారులు, రాజకీయనేతలను కూడా విచారించారు. దాదాపు 115 మందిని విచారించిన కాళేశ్వరం కమషన్ దీనిపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించింది.
అనేక కోణాల్లో...
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష రూపాయలతో కట్టినా నాసిరకం పనులు చేపట్టారని ఎన్నికల్లో ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి చేత విచారణ చేయించడానికి కమిషన్ నియమించింది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా విచారించారు. దీంతో పాటు నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీతో కూడా అధ్యయనం చేయించిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలున్నట్లు గుర్తించింది.
నివేదికలో ఏముంది?
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నియమించిన కమిషన్ గడువు పలుమార్లు ప్రభుత్వం పొడిగిస్తూ మరింత లోతైన విచారణకు అవకాశం కల్పించింది. జులై ఆఖరు నాటికి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన జస్టిస్ పినాకీ ఘోష్ అనేక రకాలుగా విచారణ చేసింది. దీంతో తుది నివేదికను నేడు ప్రభుత్వానికి సమర్పించింది. అయితే నివేదికలో గత ప్రభుత్వం పై ఏ రిమార్కులున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్టులపై కమిషన్ ఏం అభిప్రాయపడింది తదితర వివరాలను అందచేసినట్లు తెలిసింది. పూర్తి వివరాలు ఈరోజు, రేపట్లో బయటకు వచ్చే అవకాశముందని చెబుతున్నారు.