నేడు నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
నేడు సుప్రీంకోర్టు నూతన చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు
నేడు సుప్రీంకోర్టు నూతన చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్నటితో సీజేఐ జస్టిస్ గవాయ్ పదవీకాలం ముగిసింది. దీంతో ఆయన తర్వాత చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ సూర్యకాంత్ తొలి హర్యానా వాసి. జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకూ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ఉండనున్నారు.
వివిధ రంగాలకు చెందిన...
రాష్ట్రపతి భవన్ లో జస్టిస్ సూర్యకాంత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి నేపాల్, భూటాన్ శ్రీలంక, మారిషస్, కెన్యా, మలేషియా నుంచి దాదాపు పదిహేను మంది విదేశీ ప్రముఖులు హాజరు కానున్నారు.