సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ఈరోజు నుంచి వ్యవహరించనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సూర్యకాంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ జస్టిస్ సూర్యకాంత్ ఈ పదవిలో కొనసాగనున్నారు.
మోదీతో పాటు...
కార్యక్రమానికి జస్టిస్ సూర్యకాంత్ కుటుంబ సభ్యులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. హర్యానా నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్నికైన తొలి వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరు పొందారు. జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ కాలం నిన్నటి తో ముగిసింది.