సుప్రీం సీజేఐగా యు.యు. లలిత్ పేరు?

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.

Update: 2022-08-04 03:52 GMT

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. 49వ ప్రధాన న్యాయమూర్తిని నియమించేందుకు రంగం సిద్ధమయింది. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ యు. యు. లలిత తదుపరి సీజేఐ గా నియమితులయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర న్యాయ శాఖ కార్యాలయంల జస్టిస్ ఎన్వీ రమణ కార్యాలయానికి ఈ మేరకు సమాచారం పంపింది. జస్టిస్ లలిత్ 49 వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేసేందుకు అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయి.

అదే జరిగితే....
జస్టిస్ యు. యు. లలిత్ దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ కేసులో తీర్పును వెలువరించారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉండి, అనంతరం న్యాయమూర్తిగా నియమితులై తర్వాత చీఫ్ జస్టిస్ అయిన రెండో వ్యక్తి అవుతారని చెబుతున్నారు. ఈ నెల 27వ తేదీన యు. యు. లలిత్ సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈయనే ముందు వరసలో ఉన్నారు.


Tags:    

Similar News