పసిడి ప్రియులకు పండగే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700..

Update: 2023-06-16 04:55 GMT

june 16 gold and silver prices 

పసిడి ప్రియులకు ఇది నిజంగా పండగలాంటి వార్తే. వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న రూ.350 నుంచి రూ.400కు తగ్గిన 10 గ్రాముల బంగారం ధర .. నేడు కూడా రూ.350 నుంచి రూ.380 మేర తగ్గింది. రెండ్రోజుల మీద 10 గ్రాముల బంగారంపై రూ.700 నుండి రూ.780 మేర తగ్గింది. నేడు కిలో వెండిపై ఏకంగా రూ.900 తగ్గింది. తగ్గిన ధరలతో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,670గా ఉంది. కోల్ కతా, ముంబై నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,820గా ఉంది.
హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో కిలో వెండి ధర రూ.77,500 ఉండగా.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,100గా ఉంది. ముంబై, కోల్ కతాలోనూ కిలో వెండి ధర రూ.73,100 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,250గా ఉంది.


Tags:    

Similar News