తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరిగింది

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

Update: 2023-06-10 03:14 GMT

నిన్న తగ్గిన బంగారం ధరలతో.. పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడిందని సంతోషించే లోగానే మళ్లీ పెరిగింది. నిన్న రూ.400 నుండి రూ.420 మేర తగ్గిన బంగారం మళ్లీ అదేస్థాయిలో పెరిగింది. పెరిగిన ధరలతో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు శనివారం ఉదయం 6 గంటల వరకూ నమోదైనవి మాత్రమే.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600 కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,680కి పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబై, కోల్ కతా నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,830గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000 కి పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,100 కి పెరిగింది.
వెండి ధరలు ఇలా..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,500 లుగా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది. చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ. 79,700గా ఉంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.79,700 వద్ద కొనసాగుతోంది.


Tags:    

Similar News